

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ విజన్ 2047ను వివరించారు. 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ SGDP రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు.
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించనున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లతో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రీజినల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్-2, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, ఐఐఎం హైదరాబాద్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరారు. అభివృద్ధిని అర్బన్–పెరి అర్బన్–రూరల్ మోడల్ ద్వారా ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!