

యశోద ఆస్పత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలతో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. భారీ పల్మనరీ ఎంబోలిజం కారణంగా ఆయన షాక్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. మొదట వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స అందించగా, అక్కడ సుమారు 45 నిమిషాల పాటు CPR, ACLS నిర్వహించి గుండె స్పందనను పునరుద్ధరించారు. అనంతరం వరంగల్‌లో థ్రాంబోలైసిస్ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తక్కువ మోతాదులో మందులతో రక్తపోటు, కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయన శ్వాసక్రియ వెంటిలేటర్ సాయంతో కొనసాగుతోంది. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు, నొప్పి ఉద్దీపనలకు ఆయనలో స్పష్టమైన న్యూరాలజికల్ స్పందన కనిపించలేదని తెలిపారు. EEG, MRI బ్రెయిన్, CT స్కాన్ పరీక్షల్లో మెదడుకు ఆక్సిజన్ లోపం కారణంగా ఏర్పడే Anoxic Brain Damage లక్షణాలు కనిపించినట్లు పేర్కొన్నారు. 72 గంటల న్యూరాలజికల్ రీ-అసెస్‌మెంట్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులకు పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!