
జనరల్

విద్యార్థుల ఆందోళనలపై జరిగిన పోలీసు చర్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. ఈ ఆదేశాలు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారా, లేక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చారా అని ఆమె నిలదీశారు. విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, పేపర్ లీక్ ఘటనలు జరిగినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ప్రజలు ఇచ్చిన అధికారంతో తిరిగి ప్రజలపైనే దాడులు చేయడం బాధాకరమని ప్రియాంక గాంధీ అన్నారు. అన్ని వర్గాలు, మతాలకు ప్రభుత్వాలు సేవకులుగా పనిచేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, వారి ఆందోళనలను అణచివేయడం సరైన మార్గం కాదని ఆమె వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!