
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితిని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్వయంగా పరిశీలించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను సజావుగా కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు సూచించారు.
ఐకియా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, గంట నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. వాహనదారులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించాలని, ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!