
సినిమాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో ఇకపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించకూడదని పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ వెల్లడించింది. ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను వృథా చేయడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొంది.
పాలాభిషేకాలు, జలాభిషేకాల బదులుగా ఆహార పంపిణీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించింది. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటాలని పార్టీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!