
జనరల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0’ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకే డిజిటల్ వేదికపై నేరుగా అనుసంధానమయ్యేలా ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే పార్టీ కార్యక్రమాల సమాచారం ఇందులో అందుబాటులో ఉండటంతో పాటు కార్యకర్తలు నాయకులతో నేరుగా టచ్‌లో ఉండే అవకాశం కల్పించారు.
సోషల్ మీడియా వేదికలపై పార్టీ కంటెంట్ తొలగిస్తున్నారని ఆరోపించిన జగన్, అందుకే సొంత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యకర్తలపై నమోదైన కేసులు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఈ యాప్‌లో నమోదు చేసుకునే సౌకర్యం ఉంటుందని చెప్పారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తలతో నిరంతర అనుసంధానానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!