

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన వివాదంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెప్టెంబర్ 29న సమావేశం కానుంది. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అంశంలో ఎన్నికల సంఘం పనితీరుపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో పార్టీ తదుపరి కార్యాచరణపై సీడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. సీఈసీపై చర్యలు తీసుకోవాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై కూడా వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేందుకు పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టే అంశం కూడా సీడబ్ల్యూసీ చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే ఇండియా కూటమి పార్టీలతో సమన్వయం, రాబోయే ఎన్నికలకు పార్టీ సన్నద్ధత వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పలువురు సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!