

కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం ఒక విజయమే అయినప్పటికీ, ఉద్యోగ జీవితంలో నిలదొక్కుకోవడం మరో సవాలు. కొత్తగా ఉద్యోగంలో చేరిన చాలామంది యువత ‘నేను ఈ పనిని చేయగలనా?’, ‘డెడ్‌లైన్లను అందుకోగలనా?’, ‘టీమ్‌తో కలిసి పని చేయగలనా?’ అనే సందేహాలతో ఒత్తిడికి గురవుతున్నారు. నైపుణ్యాల లోపం, భాషాపరమైన సంకోచం, టార్గెట్లు, డెడ్‌లైన్ల భయం వంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి కెరీర్ పురోగతిని మందగింపజేస్తున్నాయి.
అయితే ఈ ‘కార్పొరేట్ ఫోబియా’ను అధిగమించడం అసాధ్యం కాదు. నిరంతర అభ్యాసం, స్పష్టమైన కమ్యూనికేషన్, సందేహాలను నిర్భయంగా అడగడం, కార్యాలయ సంస్కృతిని అర్థం చేసుకోవడం ద్వారా ఉద్యోగులు వేగంగా ఎదగగలరు. సీనియర్ల నుంచి నేర్చుకోవడం, పనిని సమయానికి పూర్తి చేయడం, టీమ్ చర్చల్లో చురుకుగా పాల్గొనడం వంటి లక్షణాలు సంస్థలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయి. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన ఉంటే కార్పొరేట్ ప్రపంచంలో విజయానికి మార్గం సుగమమవుతుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!