
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళగిరి ఎయిమ్స్‌లో ఒక కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాపిడ్ టెస్ట్ కిట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చూడాలని, ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!