
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులు నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఆక్వా మేత ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మేత ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగి ఆక్వా సాగు కొనసాగించడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్వా రైతులకు మద్దతుగా ఫీడ్ డీలర్లు స్వచ్ఛందంగా ఆక్వా ఫీడ్ దుకాణాలు, ఆక్వా మెడికల్ దుకాణాలను మూసివేశారు. రైతుల నుంచి రావాల్సిన బకాయిలు రోజురోజుకూ పెరుగుతున్నాయని డీలర్లు తెలిపారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!