

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అయితే ఈ కొత్త జట్టులో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. తెలంగాణకు చెందిన కీలక నేతలు బండి సంజయ్, డీకే అరుణ, కె. లక్ష్మణ్‌లకు కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. దీంతో కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం లేని ఏకైక దక్షిణాది రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
గతంలో బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, కె. లక్ష్మణ్ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ముగ్గురినీ కొత్త జాతీయ బృందంలో కొనసాగించకపోవడం తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!