

తుఫాన్ ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాధారణంగా భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ప్రస్తుతం మోస్తరు రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడులోనూ తుఫాన్ ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు, బస్సుల రాకపోకల్లో మార్పులు, రద్దుల నేపథ్యంలో పలువురు భక్తులు తమ తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
గత బ్రహ్మోత్సవాల సమయం నుంచి కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కొంత తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని భక్తులకు సుమారు రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల నిర్వహణపై దృష్టి సారించారు. తుఫాన్ ప్రభావంతో రద్దీ తగ్గడంతో ప్రస్తుతం శ్రీవారి దర్శనం కొంత సులభంగా జరుగుతోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!