

అమెరికా 2026 మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. మరోవైపు భారత సంతతికి చెందిన పలువురు నేతలు కీలక పదవులకు పోటీ చేసి విజయాలు సాధిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగిన సుహాస్ సుబ్రహ్మణ్యం, అరుణా మిల్లర్, పియా దాండియా విజయం సాధించగా.. రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామికి ఓటమి ఎదురైంది. దీంతో అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నాయకుల ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం 63 శాతానికి పైగా ఓట్లు సాధించి రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌పై విజయం సాధించారు. ఫ్లోరిడా 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి పియా దాండియా గెలిచి, ఆ రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. మరోవైపు మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ మరోసారి విజయం సాధించారు. ఒహాయో గవర్నర్ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుతో పోటీ చేసిన వివేక్ రామస్వామి.. డెమోక్రటిక్ అభ్యర్థి, వైద్యురాలు అమీ యాక్టన్ చేతిలో సుమారు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రో ఖన్నా, రితేశ్ టాండన్, ప్రమీలా జయపాల్, నీరవ్ షా, అమీ బెరా, పూజా సేథి, సందీప్ శ్రీవాస్తవ, అమిష్ షా, నిత్యా రామన్ తదితరుల ఫలితాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!