

తుఫాన్ ప్రభావం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సుమారు లక్షా 26 వేల ఎకరాల్లో వరి పైరు నేలకొరిగినట్లు సమాచారం. వేల ఎకరాల్లో అరటి, కొబ్బరి, బొప్పాయి సహా వివిధ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తుఫాన్ కారణంగా వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లడంతో పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
తుఫాన్ బీభత్సానికి జిల్లాలో 8 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయినట్లు సమాచారం. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది మరమ్మతు పనులను కొనసాగిస్తున్నారు. మరోవైపు, రహదారులపై కూలిన చెట్లను తొలగించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారులను శుభ్రం చేసే పనులు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!