

‘మురసు’ తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూర్యలంక బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీర ప్రాంతాన్ని తాకుతున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా పంట పొలాలు నీటమునిగాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
తుపాను ప్రభావంతో పలు రహదారులపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రహదారులపై పడిన చెట్లను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో భారీ అలలు, వర్షాల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు సముద్ర తీరానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!