

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. అయితే, ఈ తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, అదే రోజు సాయంత్రానికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ తుపాను బుధవారానికి తీవ్ర తుపానుగా బలపడి, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో తీరం దాటవచ్చని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలులు కూడా వీచవచ్చని చెబుతున్నారు. అయితే, తుపాను తీరం దాటే ప్రాంతంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!