

తమిళనాడులోని మదురైలో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు నిషాంత్ తండ్రి సురేశ్, అతడి స్నేహితురాలు మీనాక్షి ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందిన మీనాక్షి ఈ కేసులో నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నిషాంత్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
మదురైలోని కాలవాసల్ బైపాస్ రోడ్డులో ఇటీవల ప్రారంభమైన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో ఈ చోరీ జరిగింది. రాత్రి దుకాణానికి తాళాలు వేసి వెళ్లిన సిబ్బంది.. మరుసటి రోజు వచ్చి చూడగా షోకేసుల అద్దాలు పగులగొట్టి ఉన్నట్లు గుర్తించారు. అందులోని కిలోల కొద్దీ బంగారు, వజ్రాభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!