
బిజినెస్

సౌదీ అరేబియాలోని రాస్ తానూరాలో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ సౌదీ చమురు దిగ్గజం అరామ్‌కోకి చెందినదిగా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదంపై అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని భద్రపరిచి వివరాలు సేకరిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!