

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం కోసం సుమారు 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ వరకు విస్తరించింది. మరోవైపు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని 5 కంపార్ట్‌మెంట్లలో టైంస్లాట్ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.95 కోట్లు నమోదైంది. ఆదివారం మొత్తం 82,173 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదే రోజు 27,058 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని, దర్శన సమయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!