
జనరల్

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో నిలిపివున్న ఓ రైల్వే బోగీలో సోమవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదో, ఆరో నంబర్ ప్లాట్‌ఫాంల మధ్య ఉన్న లూప్‌లైన్‌లో అదనపు బోగీలను నిలిపి ఉంచారు. వాటిలోని ఓ బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
దాదాపు 50 నిమిషాల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. బోగీలో మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై దర్యాప్తు ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి (సీపీఆర్వో) శ్రీధర్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!