

ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను హుగ్లీ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మెడికల్ విద్యార్థిని చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. హుగ్లీ జిల్లాలోని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అనంతరం కలకత్తా హైకోర్టు పోరెల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో పాటు దర్యాప్తులో భాగంగా అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
అభిషేక్ పోరెల్ కొన్నేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడిపై నమోదైన కేసు అతడి క్రికెట్ కెరీర్‌పై కూడా చర్చకు దారితీసింది. తనపై వచ్చిన ఆరోపణలను పోరెల్ ఖండించాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!