
సినిమాలు

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. గతంలో విధించిన ఆరు నెలల శిక్షను హైకోర్టు మూడు నెలలకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నటుడికి కొంత ఊరట లభించింది.
అదే సమయంలో తీర్పు అమలుపై రెండు నెలల పాటు స్టే విధించిన హైకోర్టు, అప్పీల్ దాఖలు చేసుకునేందుకు రాజ్‌పాల్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. ఈ వ్యవధిలో ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలు ఉండగా, కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!