
జనరల్

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో 42 రోడ్లపై ట్రాఫిక్ డైవర్షన్లు, ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీలోని పలు కార్యాలయాలను మూసివేయడంతో పాటు పాఠశాలలకు కూడా ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సదస్సు జరిగే ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టనున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!