
జనరల్

అసెంబ్లీలో క్యూర్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో చెత్త సేకరణకు సంబంధించిన స్వచ్ఛ ఆటోలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటే చెత్త సేకరణకు సంబంధించిన రుసుమును వసూలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించాలని ఆమె కోరారు.
చెత్త సేకరణ బాధ్యతను ఏదైనా పెద్ద కార్పొరేట్ సంస్థకు అప్పగించడం లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలోనే స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయాలని కవిత అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వకపోతే 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!