
జనరల్

వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. సోమవారం ఉదయం లేదా మధ్యాహ్నం వరకు పారాదీప్–సాగర్ ద్వీపాల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో 7 మీటర్ల కంటే తక్కువ పొడవు గల పడవలు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!