
బిజినెస్

ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. లక్నోలో భారత్ ట్యాక్సీ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. యువత సంప్రదాయ ఉద్యోగాల కోసం మాత్రమే వెతకకుండా ఈ-రిక్షాలు, ట్యాక్సీలు నడపడం వంటి స్వయం ఉపాధి మార్గాలను కూడా పరిశీలించాలని సూచించారు. డ్రైవింగ్ ద్వారా స్వతంత్రంగా ఆదాయం పొందడంతో పాటు పని విషయంలో కొంత సౌలభ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
బ్రజేష్ పాఠక్ వ్యాఖ్యలపై రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇలాంటి సూచనల ద్వారా ఎలాంటి సందేశం వెళ్తుందనే ప్రశ్నలను వారు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం, స్వయం ఉపాధి అవకాశాలు, యువత ఆశలు, ఉద్యోగ మార్కెట్‌పై మరోసారి చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!