

నవభారత నిర్మాత, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని బాలబాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బాలలపై నెహ్రూకు ఉన్న ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయనకున్న దూరదృష్టి, విద్యాభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. బాలలే దేశ సంపద, వారే భావి భారత పౌరులనే నెహ్రూ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుతో పాటు, విద్యార్థుల పోషకాహారం కోసం అల్పాహార పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. పిల్లల కలలను సాకారం చేసి, వారికి భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన బాల్యాన్ని అందించడం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం పేర్కొన్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!