
రాజకీయాలు

వికారాబాద్లో మహిళా క్రికెటర్ నందిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇటీవల బీసీసీఐ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఆడిన నందిని.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. యువ క్రికెటర్ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.
నందిని మృతికి ప్రేమ వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె ఎదుర్కొన్న వేధింపులపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలపై అధికారుల విచారణ అనంతరం స్పష్టత రావాల్సి ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!