

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ అగ్రనేత ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతున్నారనే విషయం నూటికి నూరుపాళ్లు నిజమని, గతంలోనూ తమకు ఈ అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనే సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని, ఆయన సభలో మాట్లాడకుండా మైక్ ఇవ్వకుండా అడ్డుకునేవారని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ఆధారాలతోనే మాట్లాడారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్య అని, దీనిని తీవ్ర నేరంగా పరిగణించాలని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ విసిరిన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధం ఉందని, రాష్ట్రంలో గత పదేళ్లుగా బీఆర్ఎస్ అనుసరించిన విధానాలనే కేంద్రంలో మోదీ, అమిత్ షా కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు ఎదురైన రాజకీయ పరిస్థితులే భవిష్యత్తులో బీజేపీకి ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!