

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశేష ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్లను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు.
భక్తుల సౌకర్యం, పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (9552300009) ద్వారా నిర్ణీత సంఖ్యలో విశేష సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, దేవీ ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన వంటి సేవలకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, అర్చక బృందం మంత్రిని కలిసి దసరా మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!