
జనరల్

సిక్కిం-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. యుక్సోమ్కు సుమారు 40 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
భూకంప ప్రభావంతో సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం కారణంగా ఆస్తి నష్టం లేదా ఇతర పరిణామాలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!