
జనరల్

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఫామ్లు సమర్పించని ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తూ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. ముఖ్యంగా ఏఎస్డీడీ కేటగిరీలో ఉన్న ఓటర్లు తమ ఫామ్లను సమర్పించేందుకు మరోసారి అవకాశం ఇచ్చింది. నవంబర్ 30 వరకు ఫామ్ల పంపిణీ, సేకరణ ప్రక్రియ కొనసాగనుంది.
ఏఎస్డీడీ ఫామ్ల పరిశీలనకు డిసెంబర్ 10 వరకు గడువు విధించారు. అలాగే ఓటర్ల జాబితాపై వచ్చే క్లెయిమ్లు, అభ్యంతరాలను డిసెంబర్ 15లోగా పరిష్కరించనున్నారు. అనంతరం డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్లందరికీ అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈసీ షెడ్యూల్ను సవరించినట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!