

ఎర్రవల్లి భూముల వ్యవహారంపై విచారణ క్షేత్రస్థాయికి చేరింది. ఎర్రవల్లి, శివారు వెంకటపూర్, వరదరాజుపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూములను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. మూడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అసైన్డ్ భూముల వివరాలు, సర్వే నంబర్లు, భూముల వాస్తవ పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 325 సర్వే నంబర్‌లోని భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
భూముల రికార్డులతో క్షేత్రస్థాయి పరిస్థితులను సరిపోల్చుతూ.. అసైన్డ్ భూముల ఆధీనంలో ఎవరెవరు ఉన్నారు, వాటి ప్రస్తుత స్థితి ఏమిటనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూములపై వాస్తవాలను నిర్ధారించేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిశీలన జరుగుతోంది. అధికారులు సేకరించిన వివరాలను విచారణ నివేదికలో పొందుపరచనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!