

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. నిర్ణయించిన తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మిగిలిన షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్‌ను కూడా మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. నాని తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్‌తో నాని తొలిసారి కలిసి పనిచేయనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం డార్క్ కామెడీ అంశాలతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. అలాగే ఇది సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించనుండగా.. షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!