
జనరల్

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సంబంధించిన ప్రభుత్వ భూమి రికార్డులను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎల్పీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో వారు సిద్దిపేటకు బయలుదేరనున్నారు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్సీలకు సీఎల్పీ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రేపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం. సిద్దిపేట కలెక్టరేట్‌లో భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూముల వివరాలను పరిశీలించనున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!