

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉద్యోగాల విషయంలో భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) సుమారు 700 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించగా, డాబర్ కూడా 573 మంది ఉద్యోగులపై వేటు వేసింది. అదే సమయంలో హెచ్‌యూఎల్ మధ్యస్థ స్థాయి ఉద్యోగుల వేతనాలను సగటున 6.08 శాతం మాత్రమే పెంచి ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టింది.
అయితే అన్ని కంపెనీల పరిస్థితి ఒకేలా లేదు. హెచ్‌యూఎల్ మేనేజర్ స్థాయి కంటే దిగువ ఉద్యోగులకు సగటున 6.85 శాతం వేతన పెంపు ఇవ్వగా, డాబర్ మధ్యస్థ ఉద్యోగులకు సగటున 7.7 శాతం పెంపు అందించింది. మరోవైపు నెస్లే ఇండియా, మారికో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వేతన పెంపులు ప్రకటించాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ రంగంలో కంపెనీల వ్యూహాలు ఒక్కో సంస్థలో ఒక్కోలా ఉన్నాయని స్పష్టమవుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!