

హైదరాబాద్లోని మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబర్ 26న 10 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 20 హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా.. పలు చోట్ల బొద్దింకలు, ఎలుకలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైన కూరగాయలు, అపరిశుభ్రమైన వంటగదులు, సరైన నిల్వ పద్ధతులు లేకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు టీ.జీ. సేఫ్ అధికారులు తెలిపారు. అనుమానిత కల్తీకి సంబంధించి 21 ఆహార నమూనాలను కూడా సేకరించారు.

ఈ తనిఖీల్లో మోనాస్ట్రీ, శివాని ది రెస్టారెంట్ అండ్ బార్, అల్ సబా రెస్టారెంట్, లక్కీ మల్టీక్యూజిన్ రెస్టారెంట్, సాయిరాం మెస్, ఉడిపీస్ ఉపహార్, కోల్ స్పార్క్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్, కాంచి కేఫ్, అంథెరా కిచెన్ అండ్ బార్, అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్, ఫ్యూజన్ 9/అమ్నీషియా స్కై బార్ ఉన్నాయి. వీటి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేసి, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!