
జనరల్

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నేడు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయడం, పని ఒత్తిడిని తగ్గించడం, ఉద్యోగులపై తీసుకున్న అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్యోగులు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
మరోవైపు ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని పలు జిల్లాల పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేని ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొంటే నిబంధనల ప్రకారం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని పోలీసులు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!