27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

Writer: Nithish 07:22 AM, 27 సెప్టెంబర్, 2026
ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌, మిగిలిన ఇద్దరు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను ఈసీ తోసిపుచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు ఎస్‌.ఎస్‌.సంధూ, వివేక్‌ జోషి సంయుక్తంగా ప్రకటన విడుదల చేస్తూ.. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ పూర్తి కమిషన్‌ ఏకాభిప్రాయంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం జరిగిన పూర్తిస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. గత ఏడాది కాలంలో కమిషన్‌ తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఉన్నాయని ఈసీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టే విషయంలోనూ కమిషన్‌ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని ఈసీ తెలిపింది. బిహార్‌, పశ్చిమబెంగాల్‌తో పాటు మరో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ నిర్వహించేందుకు ప్రకటనలు జారీ చేసినట్లు పేర్కొంది. మూడో దశలో 12 రాష్ట్రాల్లో ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఓటర్ల తుది లెక్కలు వెల్లడవుతాయని తెలిపింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నోటీసులు అందుకున్న వారి ఇళ్లకు బూత్‌ స్థాయి అధికారులు వెళ్లి పత్రాలు సేకరిస్తారని, అవసరమైతే ఈఆర్‌ఓ విచారణను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చని వివరించింది. కొత్త ఓటర్లు, జాబితాలో పేర్లు లేని వారు ఈఆర్‌ఓకు దరఖాస్తు చేసుకోవచ్చని, నిరాశ్రయులు, కూలీలు, నైట్‌ షెల్టర్లలో నివసించే వారి కోసం అవసరమైన మేరకు హెల్ప్‌డెస్కులు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

ట్యాగ్లు
ఎస్‌ఐఆర్‌ఎన్నికల సంఘంజ్ఞానేశ్‌కుమార్‌ఎస్‌.ఎస్‌.సంధూవివేక్‌ జోషిఓటర్ల జాబితాఓటర్ల సవరణఎన్నికల కమిషన్‌ఈఆర్‌ఓబీఎల్‌ఓ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!