
జనరల్

చెన్నైలోని కోయంబేడు బస్ టెర్మినస్‌లో గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ‘వెట్రి పయనం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం కండక్టర్ పాత్రలో టికెట్లు పంపిణీ చేశారు. ఈ పథకం విస్తరణతో రాష్ట్రంలోని మరిన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు.
విస్తరించిన ‘వెట్రి పయనం’ పథకం కింద ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్, డీలక్స్ బస్సులతో పాటు మోఫుసిల్ సాధారణ బస్సులు, 40 కిలోమీటర్లకు మించిన కొండ ప్రాంత మార్గాల్లోని సాధారణ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 12,692 ప్రభుత్వ బస్సులు ఈ పథకం పరిధిలోకి రాగా, రోజుకు సుమారు 84.32 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!