

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను 100 శాతం రాయితీపై ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.133.31 కోట్ల వ్యయంతో 84.59 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా సుమారు ఐదు లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. మత్స్య సంపదను పెంచడంతో పాటు మత్స్యకారుల జీవనోపాధికి మరింత తోడ్పాటు అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.
2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆరు లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిని పెంచడం, మత్స్య రంగాన్ని బలోపేతం చేయడం, మత్స్యకారుల ఆదాయాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర మత్స్యశాఖ కూడా అర్హత కలిగిన నీటి వనరులకు 100 శాతం రాయితీపై చేప పిల్లలు, రొయ్య పిల్లలను అందించే పథకాలను అమలు చేస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!