

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఫ్యామిలీ వీక్ సందడి కొనసాగుతోంది. శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యుల రాకతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలు చోటుచేసుకోవడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ముఖేష్, వర్షిణి మధ్య జరిగిన వాగ్వాదం హాట్ టాపిక్‌గా మారింది. ఇక నటరాజ్ మాస్టర్ తనదైన శైలిలో హౌస్‌లో సందడి చేశారు.
ఫ్యామిలీ వీక్‌లో భాగంగా త్రిగుణ్ భార్య, కుమార్తె హౌస్‌లోకి వచ్చారు. వారిని చూసిన త్రిగుణ్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. తన కుమార్తెను ఆప్యాయంగా హత్తుకుని భార్యతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా త్రిగుణ్ ఆటతీరుపై ఆయన భార్య ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం బాగా ఆడుతున్నావని, ఇతరులు చేసే వ్యాఖ్యలతో ఆటపై దృష్టి కోల్పోవద్దని సూచించారు. కప్ గెలిచి ఇంటికి రావాలని సరదాగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
అనంతరం నీతూ భర్త నటరాజ్ మాస్టర్ కుమార్తెతో కలిసి హౌస్‌లోకి ప్రవేశించారు. తనదైన శైలి డ్యాన్స్‌తో హౌస్‌మేట్స్‌ను అలరించారు. కంటెస్టెంట్లతో మాట్లాడిన ఆయన, భార్య నీతూకు ధైర్యం చెప్పారు. కన్నీళ్లు పెట్టుకోవద్దని, వాటిని బలంగా మార్చుకుని ఆట కొనసాగించాలని సూచించారు. తాను బయట కుటుంబ బాధ్యతలు చూసుకుంటానని, నీతూ హౌస్‌లో తన ఆటపై దృష్టి పెట్టాలని చెప్పారు. నటరాజ్ మాస్టర్ రాకతో ఎపిసోడ్‌లో సందడి నెలకొంది.
ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నంబర్లు ఉన్న బ్లాక్‌లలో నిలబడాలని, బజర్ మోగే సమయానికి బ్లాక్‌లో లేని వారు ఆట నుంచి తప్పుకోవాలని బిగ్‌బాస్ సూచించారు. ఈ టాస్క్‌లో రామకృష్ణ క్వాలిఫై అయ్యారు. అయితే సంచాలక్‌గా వ్యవహరించిన వర్షిణి, బ్లాక్‌లో లేని వారిని తొలగించే క్రమంలో శ్వేత నాయుడు విషయంలో ముఖేష్‌తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ క్రమంలో వర్షిణి ముఖేష్‌ను తోసేయగా, తనను తోసొద్దంటూ ముఖేష్ హెచ్చరించారు. ఇప్పటివరకు సన్నిహితంగా కనిపించిన వీరిద్దరి మధ్య ఒక్కసారిగా గొడవ జరగడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!