
సినిమాలు

డాబర్ సంస్థకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. '100 శాతం స్వచ్ఛమైన' అని ప్రచారం చేసినప్పటికీ, తేనె, నెయ్యి, పండ్ల రసాలు వంటి కొన్ని ఉత్పత్తులు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. దీంతో ఆయా ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించినట్లు తెలిపింది.
అంతేకాకుండా, తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు డాబర్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరికలు జారీ చేసింది. నాణ్యత ప్రమాణాలను పాటించని ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే 15 రోజులలోగా తగిన వివరణ ఇవ్వాలని సంస్థను ఆదేశించింది. వినియోగదారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!