
షోస్

ఈ నెల 13న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాస్మోస్ భవనం వద్ద ఘటన చోటుచేసుకుంది. మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తమ అనుచరులతో కలిసి భవనంలోకి వచ్చి గేట్లు పగులగొట్టి, భద్రతా సిబ్బందిపై దాడి చేసినట్లు మేనేజర్ రవి పెద్ది రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన వెనుక హీరో అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్ రెడ్డి ప్రోద్బలం ఉందని ఫిర్యాదుదారు ఆరోపించారు. అయితే మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలపై కేసు నమోదు చేసిన పోలీసులు, చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!