

గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో జరిగిన భారీ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నేపాల్‌కు చెందిన కమల్ షాహీ, విమల షాహీ దంపతులతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 7.8 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశ్ పాయ్ ఇంట్లో పనిలో చేరిన ఈ దంపతులు యజమాని కుటుంబం ముంబయికి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
చోరీ అనంతరం నిందితులు సికింద్రాబాద్ నుంచి రైలులో ఉత్తరప్రదేశ్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. సైబరాబాద్ పోలీసుల సమాచారంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులను అప్రమత్తం చేయగా నిందితులు పట్టుబడ్డారు. ఈ చోరీకి సహకరించిన కరణ్ బిశ్వకర్మను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు సురేశ్ పరారీలో ఉన్నాడు. సిమ్ కార్డులు మార్చి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, వదిలిపెట్టిన సిమ్ కవర్ల ఆధారంగా పోలీసులు వారి కదలికలను గుర్తించి కేసును ఛేదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!