

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం జరుగుతోందని, ధృవీకరించని పోస్టులు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహించడం దేశ ఇంధన భద్రత, దిగుమతుల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణలో కీలకమని ఆయన పేర్కొన్నారు.
తన కుమారుడు నిఖిల్ గడ్కరీ కంపెనీకి సంబంధించిన ఆరోపణలను కూడా మంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసిన ఆయన, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై పరువు నష్టం కేసులతో సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ20 ఇంధనం, బయోఫ్యూయల్ విధానం, సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!