

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో గత నెల రోజులుగా మంచినీరు, వాడుక నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పడిపోవడంతో పాటు వాగులు, వంకలు ఎండిపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గత వారం రోజులుగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు. తొలుత ప్రతి మూడు రోజులకు ఒకసారి ప్రతి నాలుగు ఇళ్లకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 50 ట్యాంకర్లను వినియోగిస్తూ ఒక్కో ట్యాంకర్ రోజుకు పలు ట్రిప్పులు చేసేలా ప్రణాళిక రూపొందించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!