

రాప్తాడు దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం గోపిక స్వయంగా శ్వాస తీసుకుంటున్నారని, రాత్రి నిద్ర సమయంలో మాత్రమే స్వల్పంగా ఆక్సిజన్ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తున్నారని, ఫిజియోథెరపీతో పాటు వ్యాయామ చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.
మరోవైపు, గోపిక ముఖంపై ఉన్న కుట్లను వైద్యులు తొలగించారు. గాయాలకు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మెత్తటి ఆహారాన్ని నోటి ద్వారా స్వయంగా తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రక్తపోటుతో పాటు ఇతర ఆరోగ్య సూచీలు కూడా నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య బృందం నిరంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!