

చేనేత కార్మికుల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, స్వాతంత్ర్య ఉద్యమం కోసం విశేషంగా కృషి చేసిన ప్రముఖ నాయకుడు ప్రగడ కోటయ్య 110వ జయంతిని ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో 1915 జూలై 26న జన్మించిన ఆయన, చేనేత రంగం అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారు. సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు 1945లో ఆల్ ఇండియా హ్యాండ్‌లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1947లో ‘చేనేత’ వారపత్రిక సంపాదకుడిగా సేవలందించారు.
ప్రగడ కోటయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవ చేశారు. చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లును స్థాపించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక జాతీయ స్థాయి సహకార సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ‘ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!