

యాంటిసిపేటెడ్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి”పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఇందులోని బుల్ ఫైట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లోని బుల్ ఎలివేషన్ షాట్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ సన్నివేశానికి సంబంధించిన పూర్తి స్థాయి యాక్షన్ ఎపిసోడ్‌ను వచ్చే వారం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారీ యాక్షన్‌తో పాటు రాజమౌళి సినిమాల్లో కనిపించే బలమైన భావోద్వేగాలను కూడా ఈ పోరాట సన్నివేశంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ స్థాయిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు రూ.1,300–1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న “వారణాసి” ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల లేదా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం నిర్మాణానంతర పనులు, విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. మహేష్ బాబు పాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్న రాజమౌళి, కథకు అవసరమైన భావోద్వేగాన్ని ప్రతి సన్నివేశంలోనూ జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 ఏప్రిల్ 7న “వారణాసి” ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న ఈ విజువల్ వండర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!